10 బంతుల్లో 14 పరుగులు... 5 బంతుల్లో 13 పరుగులు.. ఈ గణాంకాల

10 బంతుల్లో 14 పరుగులు... 5 బంతుల్లో 13 పరుగులు.. ఈ గణాంకాలు చూసి టీ20ల్లో ఫర్వాలేదు కదా అని అనిపించొచ్చు. కానీ,。

అంతర్జాతీయ మ్యాచ్లు అలా కాదు. ఇక్కడ ప్రతిదీ ఓ పరీక్షే. తుది జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. వరల్డ్ కప్లో అదరగొట్టిన సంజు శాంసన్నే మేనేజ్మెంట్ వరుసగా మూడు మ్యాచులు ఆడకపోతే పక్కన పెట్టింది. ఇదే నియమం ఇటు వైభవ్కూ వర్తిస్తుందనేది గుర్తెరగాలి. వీరిద్దరే కాదు.. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. అయితే, కుర్రాడికి మరిన్ని ఛాన్స్లు ఇవ్వాలనేవారూ లేకపోలేదు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. ఇందులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ చేసినా వైభవ్ భవిష్యత్తుకు ఢోకా ఉండదు. ప్రతి ప్లేయర్కూ అవకాశాలు ఇస్తాం.. ఫామ్ ఆధారంగానే జట్టులోకి ఎంపిక ఉంటుందని భారత ప్రధాన కోచ్ చేసిన వ్యాఖ్యలను వైభవ్ కూడా మనసులో పెట్టుకోవాలి. - ఇంటర్నెట్ డెస్క్ , ఇదే కొనసాగితే మాత్రం తుది జట్టు ఎంపికలో ప్రత్యామ్నాయాల వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపడం ఖాయం. అయితే, కోచింగ్ స్టాఫ్ ఇచ్చే సపోర్ట్తోపాటు మైదానంలోనూ, బయటా ప్లేయర్ల సహకారం అత్యంత కీలకం. తొందర అక్కర్లేదు కానీ.. అరంగేట్రం చేసిన రెండో మ్యాచ్కే వైభవ్ సత్తాపై సందేహాలు అవసరం లేదు. కానీ, మిగతావారికి కాస్త అనుభవం ఉంది. వైభవ్ ఇప్పుడే వచ్చాడు.. కాబట్టి సీనియర్లే సలహాలు, సూచనలు ఇచ్చి నడిపించాలి. కెప్టెన్, మేనేజ్మెంట్, ఆ ప్లేయర్ నుంచి ఆశించిన స్కోర్లు ఇవి కాదు. అసలే వరల్డ్ కప్ హీరోను పక్కన పెట్టి మరీ ఈ యువ సంచలన చిచ్చరపిడుగుకు అవకాశం ఇచ్చారనే విమర్శలు వస్తున్న వేళ.. అందుకు తగినట్టుగా భారీ ఇన్నింగ్స్లు లేకపోతే మున్ముందు ఒత్తిడి పెరగడం ఖాయం. పైన ఉపోద్ఘాతమంతా.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి అని ఇప్పటికే అర్థమై ఉంటుంది. అతడిని సంజు శాంసన్ను కాదని ఇంగ్లాండ్తో మ్యాచుల్లో తుది జట్టులోకి మేనేజ్మెంట్ తీసుకుంది. అయితే.. ఐపీఎల్లో చూపించిన దూకుడును ఇక్కడ ప్రదర్శించలేకపోతున్నాడు. అతడి ఫామ్లో ఇబ్బంది లేనప్పటికీ.. ఇంగ్లాండ్ బౌలర్లు మన కుర్రాడి బలహీనతపై దెబ్బ కొడుతున్నారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. గత రెండు మ్యాచుల్లోనూ ఊరించే బంతులతోనే వైభవ్ను పెవిలియన్కు చేర్చారు. కాస్త నిలదొక్కుకుంటే.. ఓ వైపు సీనియర్ అభిషేక్ శర్మను చూసి.. వైభవ్ తన దూకుడును అదుపులో ఉంచుకోవాలి. ఇంగ్లాండ్ పిచ్లపై పరుగులు చేయాలంటే సహనం అత్యంత ముఖ్యం. మూడో టీ20 మినహా.. గత రెండు మ్యాచుల్లోనూ అభిషేక్ అదే చేసి చూపించాడు. వైభవ్ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. చెత్త బంతిని స్టాండ్స్లోకి పంపించాలనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి బాల్నూ అలానే ఆడతానంటే ఇక్కడ కుదరదు. పిచ్పై అనూహ్యమైన బౌన్స్ వస్తుంటుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లూ కాస్త తెలివిగా వైభవ్ను బోల్తా కొట్టించారు. ఐపీఎల్లో తన సహచరుడైన జోఫ్రా ఆర్చర్కు వైభవ్ గురించి తెలియకుండా ఉంటుందా..? ఎలాంటి షాట్లు కొడతాడు? ఎక్కడ మెరుగ్గా ఆడతాడు? ఏ షాట్ కొట్టేందుకు ఇబ్బంది పడతాడు? అనే దానిపై ఇంగ్లాండ్ శిబిరం దృష్టి పెట్టింది. అందుకే.. కొన్ని ఓవర్లు కుదురుగా క్రీజ్లో పాతుకుపోవాలి. ఆపై విధ్వంసం సృష్టించడం ఎలాగో వైభవ్కు తెలుసు. సీనియర్లు సలహాలివ్వాలి.. వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 ఏళ్లే. ఐపీఎల్లో అంటే ఒక మ్యాచ్ పోయినా.. ఇంకా 13 ఉంటాయి. జట్టుకు వచ్చిన నష్టమేమీ ఉండదు. కానీ。

内容版权声明:除非注明,否则皆为本站原创文章。

转载注明出处:http://acg.inmoke.com/zixun/Jk/15873.html